బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే దేశానికి రక్ష
రామచంద్రపురం: రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ సర్కిల్ వద్ద విశ్వకర్మ జయంతి(Vishwakarma jayanti), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదిన పురస్కారించుకోని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కారించారు. తధుపరి మోడీ ఫోటోకు పాలు పోసి బీజేపీ(BJP) నాయకులు శైలజ సౌజన్యంతో స్వీట్ బాక్స్ లు పంపిణి చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారని విశ్వకర్మ చిత్రపటానికి పూజ చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రజినీ, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ... మోడీ జన్మదిన వేడుకలు, విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) ఒకే రోజు రావడం ఎంత అదృష్టం అది మేము జరుపుకోవడం మా అదృష్టం అని మోడీ పాలన ఎంతో గొప్పగా ఉంది అని దేశానికి రక్ష బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షులు నందారెడ్డి, శైలజ, శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు రజినీ, గీతా, శర్మ, బస్వమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.