విమోచన దినోత్సవ వేడుకలు, పతాక ఆవిష్కరణ
17-09-2026 | 03:29pm
చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం(Single Window Office)లో తెలంగాణ విమోచన దినోత్సవ(Telangana Liberation Day), ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్(Single Window Chairman Tippani Srinivas) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజని అలాగే నిజాం, రజాకార్ల పాలన నుంచి విముక్తి పొందిన రోజుగా భావించి దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా పిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పుల్కా మోహన్, డైరెక్టర్లు మొగిలి రవి, గుడిసె రమేష్, సంఘ సిబ్బంది రైతు సోదరులు పాల్గొన్నారు.