కళ్లేపల్లిలో జాతీయ సమైక్యతా దినోత్సవం
17-09-2026 | 03:17pm
బెజ్జంకి, సెప్టెంబర్ 17: కళ్లేపల్లి(Kallepalli) గ్రామంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ(National Unity Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమైక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, కార్యదర్శి ఆకుల రాకేష్, వార్డు సభ్యులు మంకాల మోహన్, నిశని అనిల్, మంకాల మిథున్, ఒగ్గు కానుకయ్య, వేదిరే సతీష్, కారోబార్ స్వామి, అంగన్‌వాడీ టీచర్లు భూలక్ష్మి, కవిత, సీఏ అశ్విని, ప్రీమ్ బిచ్చతి తదితరులు పాల్గొన్నారు.