23 కిలోల గంజాయి స్వాధీనం

01-10-2026 | 02:43pm

ఇద్దరు నిందితుల అరెస్టు ఒడిశా నుంచి నగరానికి అక్రమ రవాణా

శేరిలింగంపల్లి,అక్టోబర్‌ 1 (విజయక్రాంతి): లింగంపల్లి రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(District Task Force police ) నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్‌, రషీద్‌లుగా పోలీసులు గుర్తించారు.

ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాన్ని అధికారులు సీజ్‌ చేసి, నిందితులను తదుపరి విచారణ కోసం శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, ముఠా సభ్యుల పాత్రపై కూడా అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు