కిష్టారంలో కొత్త మెడికల్ స్టోర్ ఓపెన్!

01-10-2026 | 03:58pm

సత్తుపల్లి, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం మెయిన్ సెంటర్‌లో న్యూ అమ్మ మెడికల్ స్టోర్ **(MEDICAL STORE)**ను కిష్టారం సర్పంచ్ నరుకుళ్లు రాజేశ్వరి అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి అప్పారావు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు అత్యవసర సమయంలో మందులు అందుబాటులో ఉండే మెడికల్ స్టోర్ (MEDICAL SHOP) ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

మెడికల్ స్టోర్ నిర్వాహకులు కువ్వారపు సతీష్ మాట్లాడుతూ 24/7 మందులు (MEDICINES) అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉండేలా మెడికల్ షాప్‌ను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు (CONGRESS WORKERS) అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు (HEALTH SERVICES) అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు