రసాయనాలకు నో.. సేంద్రియానికి ఓకే!

01-10-2026 | 03:45pm

బేల, అక్టోబర్ 01 (విజయక్రాంతి): మండలంలోని చాందపల్లి గ్రామంలో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల సోనేరావు, భవానీగూడ సర్పంచ్‌తో పాటు పలువురు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంజుల సోనేరావు మాట్లాడుతూ, గ్రామంలో బయో రిసోర్స్ సెంటర్ (BIO RESOURCE CENTRE) ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీంతో రసాయన పురుగుమందుల వినియోగాన్ని, సాగు ఖర్చులను కొంతవరకు తగ్గించుకోగలిగామని పేర్కొన్నారు.

రైతులు సేంద్రియ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలను పండించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ (ORGANIC FARMING) పద్ధతులతో నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు. రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల (NATURAL METHODS) వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు (TECHNICAL GUIDANCE) అందించాలని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు