కమిషనర్ ఆదేశాలు బేఖాతర్..!
- ఇంపీరియల్ గార్డెన్‌లో ఎస్.కె నవరాత్రి ఉత్సవ్ ముసుగులో నిబంధనల ఉల్లంఘన
- ఇంపీరియల్ గార్డెన్‌లో అర్ధరాత్రి వరకు దాండియా ధమాల్
- భక్తి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా దాండియా
- నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- 10 గంటలకి ఆపేయాల్సి ఉన్నా 11 గంటల తర్వాత కూడా దాండియా కొనసాగింపు
అక్టోబర్ 12 (విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ జారీ(Malkajgiri Police Commissioner issues order) చేసిన మార్గదర్శకాలు, శబ్ద నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఇంపీ రియల్ గార్డెన్(Imperial Garden) ఎస్.కె నవరాత్రి ఉత్సవ్నిర్వాహకులపై వ్యక్తమవుతున్నాయి. ఎస్.కె. నవరాత్రి ఉత్సవ్(S.K. Navaratri Utsav)2026.. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ధమాల్’(Hyderabad's Biggest Dandiya Dhamal) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో నిబంధనలను పట్టించు కో కుండా అర్ధరాత్రి వరకు దాండియా నృత్యా లు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం రాత్రి 10 గంటలకు బంద్ చేయవలసి ఉనన్నా 11 గంటల వరకు కొనసాగిస్తున్న పోలీసులు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. నగరంలో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు, డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, భారీ సౌండ్ బాక్సులు, ఆకర్షణీయమైన లైటింగ్తో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, ము ఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘనపై పోలీసుల చర్యలు ఏవీ?
హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం వినోద కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు తీసుకోవడంతో పా టు, అనుమతించిన సమయాన్ని పాటించడం తప్పనిసరి. నాయిస్ పొల్యూషన్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్2000 ప్రకారం సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే, వర్తించే చట్టాలు, అనుమతులు, ప్రత్యేక మినహాయింపుల ఆధా రంగా నిబంధనల అమలు నిర్ణయించ బడుతుంది.
హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం నేరం ఉల్లంఘించిస్తే సెక్షన్ 21(1) (ఇ) అండ్ సెక్షన్ 23: పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి. అనుమతి సమయం దాటి నిర్వ హించడం.‘సెక్షన్ 76: ప్రజలకు ఇబ్బంది కలిగించేలా శబ్దం చేయడం. ‘సెక్షన్ 83: పోలీస్ ఆదేశాలను ధిక్కరించడం.‘ నాయిస్ పొల్యూషన్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2000 - రూల్ 5: రాత్రి 10 గం. నుండి ఉదయం 6 గం. వరకు లౌడ్ స్పీకర్ నిషేధం. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన.‘బిఎన్‌ఎస్ సెక్షన్ 292: ప్రజలకు న్యూసెన్స్ కలిగించడం.
వాటిలో పేర్కొన్న సమయ పరిమితులు, శబ్ద నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై సంబంధిత అధికా రులు పరిశీలన జరపాలని స్థానికులు కోరుతున్నారు. పండుగల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని స్థానికులు సూచిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత సంబం ధిత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.