పార్టీల గ్రౌండ్ లెవెల్ ‘పాట్లు’

23-10-2026 | 05:30am
  1. మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ మహా సంగ్రామం
  2. మార్నింగ్ వాక్‌లు, స్టడీ కేంద్రాలు 
  3. కోచింగ్ సెంటర్లే అడ్డాగా నేతల ప్రచార హోరు
  4. డిజిటల్ రిజిస్ట్రేషన్ల జోరు
  5. పల్లెల్లో స్పీడు... పట్టణంలో నత్త నడక 
  6. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార.. ప్రతిపక్ష పార్టీలు 

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్  రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) రాజకీయం రంజుగా మారుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పదవీకాలం 2027 మార్చి 27తో ముగియనుండటంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది మార్చి 23 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ను ప్రకటించడంతో, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో ఓటర్ల వేటను తీవ్రతరం చేశాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

తెల్లవారుజామున పార్కులు మొదలు.. కోచింగ్ సెంటర్ల వరకు చక్కర్లు కొడుకు పడరని పాటలు పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఓటర్లకు భిన్నంగా, చదువుకున్న పట్టభద్రులు ఓటర్లుగా ఉండాలి. ఇందుకోసం ప్రతి అర్హుడు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ నిబంధనే పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ బూట్ల వారీగా ప్రత్యేక బృగాలను రంగంలోకి దించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువత వద్ద కు పార్టీ ల నేతలు పరుగులు తీస్తున్నారు తెల్లవారుజామునే పార్కులు, వాకింగ్ ట్రాక్లు, యోగా శిక్షణ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

యువతను టార్గెట్ చేస్తూ విద్యాసంస్థలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ , జేఎన్టీయూ, తెలుగు విశ్వవిద్యాలయాలతో పాటు అమీర్పేట్, దిల్సుఖ్నగర్ పరిధిలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ కోచింగ్ సెంటర్లను నేతలు చుట్టేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖి సమావేశాలు నిర్వ హిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.

‘వాట్సాప్’ రిజిస్ట్రేషన్లు!

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలు ఓటర్ల నమోదులో టెక్నాలజీని విరివిగా వాడుతున్నాయి. ఓటర్ల కోసం ప్రత్యేకంగా క్యూఆర్  కోడ్లతో కూడిన డిజిటల్ పోస్టర్లను వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు.. మొబైల్లో దరఖాస్తు ఫారమ్ ప్రత్యక్షమవుతుంది.

డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, పాత ఓటర్ కార్డులోని ఎపిక్ నంబర్ తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’బ్యాకెండ్ టీమ్’ ఈ దరఖాస్తులను పరిశీలించి విజయవంతంగా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఆ తర్వా త తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతూ ఎస్‌ఎంఎస్లు, వాయిస్ కాల్స్, వాట్సాప్ సందేశాలతో హోరెత్తిస్తున్నారు. గ్రామ,మండలం వారిగా ఇప్పటికే... పరువుల జాబితాను ఆయా పార్టీల నేతలు సిద్ధం పనిలో నిమగ్నమయ్యారు.

పార్టీల వ్యూహాలు.. అభ్యర్థుల హడావుడి..  కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుతో దూకుడు

అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన సామ రామ్మోహన్రెడ్డి పేరును అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆయన రోజుకో నియోజకవర్గంలో పర్యటిస్తూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్‌ఎస్ యూఐ, యువజన కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదును పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్‌ఎస్... ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పడిన ఓట్లు, నమోదైన పట్టభద్రుల వివరాలను సేకరించి.. వారి పేర్లను ఈసారీ ఓటర్ల జాబితాలో కచ్చితంగా చేర్పించేలా కిందిస్థాయి క్యాడర్ను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అడ్వకేట్లు, నిరుద్యోగులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ మద్దతు కూడగట్టే పనిలో పడింది. త్వరలోనే బలమైన అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.

బీజేపీ అంతర్గత మథనం..

భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, పార్టీ లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉంటూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల, ఒకవేళ ఫలితం వ్యతిరేకిస్తే పార్టీ ఇమ్పే ప్రభావం పడుతుందనే వాదన ఉంది. దీంతో పార్టీకి యువతలో గట్టి పట్టున్న వేరే నాయకుడిని బరిలోకి దించాలా లేక రాంచందర్రావుకే అవకాశం ఇవ్వాలా అనేదానిపై అంతర్గత వేదికల్లో తీవ్ర చర్చనడు స్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6 తుది గడువు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఫారమ్-18 ద్వారా తమ ఓటును నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు