రుద్రంగి అటవీ ప్రాంతంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటన
రుద్రంగి అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల,రుద్రంగి అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(State Government Whip Adhi Srinivas ) పర్యటించారు రుద్రంగిలోని సీమర్లు గోలేపు లొద్ది నుండి నాగారం చెరువు,రెండు గట్ల వాగు క్షేత స్థాయిలో పరిశీలించిన విప్,ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ...
దట్టమైన అడవుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి వన్యప్రాణులకు, ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అడవుల్లోని సహజ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ రుద్రంగి మండలంలోని పరిధిలోని దట్టమైన అడవుల్లో ఏడాది పొడవునా సహజసిద్ధంగా ప్రవహించే వాగులు, వంకలను పరిశీలించాం.
వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడతాం వన్యప్రాణులకు వేసవిలోనూ నీటి భరోసా అడవుల్లో నీటిని నిల్వ చేయడం ద్వారా వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవరాశులకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.సహజ నీటి ప్రవాహాలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేందుకు, పరిసర ప్రాంతాల్లో నీటి లభ్యత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.
సీమర్ల ఒర్రె, సూరమ్మ బుగ్గ ఒర్రె తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లను పరిశీలించి, అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాం.రెండు గట్ల వాగు తదితర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసి, సాధ్యమైన చోట నాగారం చెరువుకు మళ్లించే అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.బుగ్గ రాజేశ్వర స్వామి సమీపంలోని చెక్‌డ్యామ్ ద్వారా నీటిని నిల్వ చేయడం వల్ల సమీప గిరిజన తండాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడతాం.
అటవీ శాఖ డీఎఫ్ఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అంచనాలు రూపొందించాలని సూచించాం. అందుబాటులో ఉన్న అటవీ శాఖ నిధులతో పాటు,అవసరమైన అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తాం.
భవిష్యత్తులో ఎండలు,నీటి కొరత తీవ్రత పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యంత అవసరం,చెక్‌డ్యామ్‌లు, కుంటలు,చిన్న చెరువులను పునరుద్ధరిస్తాము అటవీ మరియు ఇరిగేషన్ శాఖల సమన్వయంతో అవసరమైన పనులను వేగవంతం చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన డిఎఫ్ఓ సత్యనారాయణ, ఎఫ్ఆర్ఓ మాధవి సీతల్ ఇరిగేషన్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.