గుండ్లపల్లి లో 11 కెవి హై టెన్షన్ వైరుతో వృద్ధునికి ప్రమాదం!!
సంబంధిత అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు గ్రామస్తులు ఆరోపణ!!
శివంపేట సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): శివంపేట మండల(Shivampet Mandal) కేంద్రంలోని గుండ్లపల్లిలో 11 కెవి హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఇండ్లపై మధ్య ప్రమాదకరంగా ఉండడం వల్ల గుండ్లపల్లిలో మూడో వార్డులో ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం చోటు చేస్తుందని గ్రామస్తులు తెలిపారు. బోర్డింగ్ కుమార్ మామ ఎల్లయ్య భవనం పైకి ఎక్కే క్రమంలో కరెంట్ షాక్ తో కిందపడడం జరిగింది.
విద్యుత్ లైన్ల ఇండ్ల మధ్యనే ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఐటెన్షన్ వైర్లను తొలగించాలని పలుమాలు చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ వైర్లను తొలగించని ఎడల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని స్థానిక సర్పంచ్ పెంజర్ల నర్సింలు మమత, ఉప సర్పంచ్ మస్కూరి సత్యనారాయణ, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.