స్వచ్ఛత హి సేవ పోస్టర్ ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: జిందం కళ చక్రపాణి
రాజన్న సిరిసిల్ల19 సెప్టెంబర్ (విజయక్రాంతి): స్వచ్ఛ భారత్ మిషన్‌లో (Swachh Bharat Mission) భాగంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమం పోస్టర్‌ను సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ‘మన ఊరు–మన బాధ్యత’ అనే భావనతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని సహజ పువ్వులు, రంగులను మాత్రమే వినియోగించాలని, ప్లాస్టిక్ పువ్వులు, రసాయన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. పూజా సామగ్రిని నీటిలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుడు నంది శంకర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.