బోయిన్పల్లి మోడల్ స్కూల్లో నో బ్యాగ్ డే
యోగాసన పై అవగాహన సదస్సు
బోయినపల్లి: సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో (Telangana Model School) నో బ్యాగ్ డే సందర్భంగా యోగాసనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు యోగాసనాలు చేస్తూ వాటి ఉపయోగాలను వివరించారు. తదనంతరం విద్యార్థులకు క్విజ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ మొదలైన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎరువ రఘునాథ్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గారి ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న
నోబ్యాగ్ డే వల్ల విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వత మెరుగవుతుందని విద్య పట్ల ఉత్సుఖత పెరుగుతుందని సంపూర్ణ మానసిక పరిపక్వతకు ధోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ కమిటీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు