సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
- కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు అవగాహన
టేకులపల్లి, (విజయక్రాంతి): విజిలెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్(Vigilance Awareness Campaign)లో భాగంగా సింగరేణి కోయగూడెం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సీఎంపీఎఫ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్(Koyagudem OC Project) ఆఫీసర్ మాధవరావు, సీఎంపీఎఫ్ కొత్తగూడెం రీజినల్ ఆఫీసర్ కనకమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకమ్మ మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్‌కు సంబంధించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించి 35 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అర్హులైన ప్రతి కార్మికుడికి సీఎంపీఎఫ్ ప్రయోజనాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఎంపీఎఫ్ చందాలు, ప్రయోజనాలు, పెండింగ్ సమస్యలు, దరఖాస్తు విధానం, పరిష్కార ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు. కార్మికుల నుంచి దరఖాస్తులు, సమస్యలను స్వీకరించారు. సీఎంపీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు సులోచన, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ బి.ఎల్. వెంకటేశ్వర్లు, కేఓసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్. అశోక్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.