సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన

17-11-2026 | 05:15am
  1. జాతీయస్థాయి క్రీడాకారులకు ఘన సన్మానం
  2. కల్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు
  3. పలు అభివృద్ధి పనుల ప్రారంభం

రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Sircilla District) బీఆర్‌ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సోమవారం పర్యటించారు. జగ్గారావుపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని, బాబాజీ నగర్‌లో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం చిన్నబోనాల శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రుక్మిణి వేణుగోపాల కృష్ణస్వామి ఆలయ 11వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

క్రీడారంగంలోని(Sports) వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో(National level) రాణిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన క్రీడాకారులను కేటీఆర్ ఘనంగా సత్కరించి అభినందించారు. వారి విజయాలు జిల్లాకు గర్వకారణమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్ కల్లూరి రాజు తల్లి కల్లూరి వెంకవ్వ దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకలు, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ 9 వ వార్డు పరిధి లోని బాబాజీ నగర్ లో కమ్యూనిటీ హాలును కేటీఆర్ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు