భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పొద్దు

17-11-2026 | 05:20am

దౌత్య వివాదం తలెత్తుతుంది: ఇటలీ నాయకురాలు

యూరోపియన్ సోషలిస్ట్ నేతపై బెర్గామిని ఫైర్

న్యూఢిల్లీ, నవంబర్ 16: భారత్‌లో ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై(Electoral system, democracy) విదేశీ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలు(A politician's remarks) అంతర్జాతీయంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో(India Summit) ‘ఓట్ చోర్(Vote Thief).. గద్దీ ఛోడ్’ అంటూ మోదీపై విమర్శలు చేసిన యూరోపియన్ సోషలిస్టు నేత జియాకోమో ఫిలిబెక్‌ను(European Socialist leader Giacomo Filibeck) పలువురు విమర్శస్తున్నాయి.

స్నేహపూర్వక దేశమైన భారత్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఇటలీకి చెందిన అధికార పక్ష కూటమి నాయకురాలు డెబోరా బెర్గామిని(Deborah Bergamini) అన్నారు. భారత్‌కు యూరప్ నాయకులు(European leaders) ప్రజాస్వామ్య పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్‌తో ఇటలీకి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అనేక రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయని గుర్తు చేశారు. 

ఎవరీ డెబోరా బెర్గామిని?

డెబోరా బెర్గామిని ఇటలీకి చెందిన ఫోర్జా ఇటాలియా పార్టీలో కీలక నాయకురాలు. ఆ పార్టీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో యూరోపియన్ సోషలిస్టు పార్టీ నేత జియాకోమో ఫిలిబెక్ పాల్గొన్నారు. భారత్‌లో ఓటర్ల జాబితాల పారదర్శకతపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యం అనేది ఎవరో ఇచ్చేది కాదని.. దాన్ని కాపాడేందుకు ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ విమర్శలు.. శివసేన మద్దతు

ఫిలిబెక్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత దేశాన్ని అప్రతిష్టపాలు చేసినా రాహుల్ గాంధీ అధికారంలోకి రాలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. విదేశీ శక్తులతో కలిసి భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. ‘ఒక విదేశీయుడు భారత్‌ను అవమానిస్తున్నప్పుడు భారతీయుడు నవ్వడం మీరెప్పుడైనా చూశారా?’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్’ వేదికగా ప్రశ్నించారు.

దేశ రాజకీయ అంశాల్లోకి విదేశీ నేతలను తేవడం కాంగ్రెస్ చేస్తున్న తప్పిదమని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ నేతలు విమర్శించే అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌కు తగదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచదర్ రావు విమర్శించారు. భారత అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ నాయకుడు వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏమిటని బీఆర్‌ఎస్ నేత కార్తీక్ ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాత్రం ఫిలిబెక్‌కు మద్దతుగా నిలిచారు. ఇటలీ ప్రధానికి మోదీ ‘మెలోడీ’ చాక్లెట్లు ఇస్తే తప్పు లేదు కానీ.. భారత్ వచ్చిన ఇటలీ నాయకుడు ఇక్కడి పరిస్థితుల గురించి మాట్లాడటంలో తప్పేముందని ప్రశ్నించారు. 

వీసా నిబంధనల ఉల్లంఘన 

ఫిలిబెక్ వ్యాఖ్యలు వీసా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా కాన్ఫరెన్స్ వీసాపై వచ్చిన వ్యక్తి భారత అంతర్గత రాజకీయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం, రాజకీయ నినాదాలు చేయడం నిబంధనల కిందికే వస్తుందని అధికారులు అన్నారు. అయినా.. ఆయనపై వీసా ఉల్లంఘన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. 

మరిన్ని వార్తలు