హైదరాబాద్‌కు నీటి గండం
- వేసవికి ముందే బోర్లు ఎండిపోతున్నాయి
- ప్రభుత్వానికి ముందు చూపు లేదు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో(Hyderabad) రాబోయే వేసవిలో తీవ్ర తాగునీటి సంక్షోభం(Drinking water crisis) తలెత్తే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి(BRS MLA Sudheer Reddy) హెచ్చరించారు. నవంబర్ నెలలోనే నగరంలో బోర్లు ఎండిపోతున్నాయని, మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నీటి సమస్యే లేదంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు.
వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నీటి నిర్వహణ అధ్వానంగా తయారైందని, ముందు చూపు లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే సింగూరు, మంజీర జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయని, కృష్ణా జలాలను మూడు విడతల్లో తీసుకొస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.
నగరంలో ట్యాంకర్ల వినియోగం 2.33 లక్షల వరకు చేరడం నీటి సమస్యకు అద్దం పడుతుంన్నారు. హైదరాబాద్‌లో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని, పొదుపుగా వాడుకోవాలని సీఎం హెచ్చరిస్తుంటే, నీటి కొరతే లేదని మంత్రి ఉత్తమ్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం మాటలు నమ్మాలా?, మంత్రి మాటలు నమ్మాలా? అని నిలదీశారు.
నీటి సమస్య తీవ్రంగా ఉందని గుర్తించిన బీఆర్ఎస్.. గతంలో జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా చేశామని, సమస్య రాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నవంబర్లోనే నీటి ఇబ్బందులు పెరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్య పరిష్కరించకుండా అంతర్జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. పరిశ్రమలకు కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీలే దిక్కయ్యాయని, కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.