అకాల వర్షానికి తడిసిన దాన్యం
రైతుల్లో ఆందోళన
గంభీరావుపేట నవంబర్ 02(విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలుచోట్ల కొనుగోలు కేంద్రాలలో(Purchasing center) ధాన్యం తడిసింది. గంభీరావుపేట,నర్మాల, లింగన్నపేట, కొత్తపల్లి,రాజుపేట శ్రీ గాద దేశాయిపేట తదితర గ్రామాలలో మోస్తారు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్లమీద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడమే ఈ నష్టానికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడవడంతో తేమశాతం పెరిగి నాణ్యత దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.