ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

10-09-2026 | 02:01pm

గంభీరావుపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం(Gambhiraopet Mandal) నాగంపేట గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై( Financial literacy awareness ) కేడీసీసీ బ్యాంక్ గంభీరావుపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు గ్రామస్తులకు డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు రుణాలు, వివిధ పథకాలు, ఇన్సూరెన్స్, డిపాజిట్లు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు వంటి అంశాలపై వివరించారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండి బ్యాంకింగ్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ మల్లారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ సురభి ప్రసాద్ రావు, ప్యాక్స్ సీఈవో రాజిరెడ్డి, బ్యాంకు సిబ్బంది, సొసైటీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు