ప్రజావాణికి మూడు దరఖాస్తులు

02-11-2026 | 08:29pm

భిక్కనూర్, నవంబర్ 2 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో(MPDO Office) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. వీటిలో ఏపీవో విభాగానికి ఒకటి, ఎక్సైజ్ శాఖకు ఒకటి, ఎంపీవో విభాగానికి ఒకటి చొప్పున దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు