ఎల్ నినో హెచ్చరిక

22-10-2026 | 03:57pm
  1. యాసంగిలో ‘వరి’ వద్దు...
  2. ఆధునిక పద్ధతుల్లో  ఆరుతడి పంటలతోనే లాభాల పంట
  3. సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి 

సుల్తానాబాద్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): ప్రస్తుత ఎల్ నినో  పరిస్థితుల(El Niño conditions) నేపథ్యంలో వర్షపాతం తగ్గడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో వ్యవసాయ శాఖ రైతులకు కీలక హెచ్చరికలు జారీ చేసిందని, ముఖ్యంగా రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటకు బదులుగా అందుబాటులో ఉన్న నీటి వనరులను బట్టి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ఎంచుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి తెలిపారు.

గురువారం ఆమె మాట్లాడుతూ రైతులు ఈ కరువు పరిస్థితులను తట్టుకుని, పెట్టుబడి నష్టపోకుండా తక్కువ సాగు వ్యయం తో గరిష్ట లాభాలు సాధించేందుకు వీలుగా ఆయా ఆరుతడి పంటల కాలపరిమితి, సగటు దిగుబడి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా కనీస మద్దతు ధరలు 2026-27) వివరాలతో పాటు నీటిని, పెట్టుబడిని పొదుపు చేసే ఆధునిక సాగు పద్ధతుల సమగ్ర సమాచారం తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటల వివరాలు & మద్దతు ధరల  (యాసంగి 2026-27)నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, గరిష్ట మార్కెట్ ధర మరియు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను ఎంచుకోవడమే రైతులకు లాభదాయకం.

నువ్వులు (Sesamum) — అత్యధిక వాణిజ్య విలువ గల పంట

మేలైన విత్తన రకాలు: శ్వేత (Gouri), యెలమంచిలి-1, యెలమంచిలి-61 

పంట కాలపరిమితి & దిగుబడి: 80 – 85 రోజులు | ఎకరానికి 3 – 4 క్వింటాళ్లు 

• మద్దతు ధర (MSP 2026-27): క్వింటాలుకు ₹10,346 (ప్రత్యామ్నాయ పంటలన్నింటిలో కెల్లా అత్యధిక ధర)

• కీలకమైన నీటి అవసర దశలు: పూత దశ మరియు కాయలు ఊరే దశ. యాసంగి చివర్లో వచ్చే ఉష్ణోగ్రతలకు ఇది బాగా తట్టుకుంటుంది.పెసర (Green Gram) & మినుము (Black Gram) — భూమి సారాన్ని పెంచే పంటలు

• మేలైన విత్తన రకాలు: పెసర: MGG 295, MGG 348, WGG 42 | మినుము: LBG 752, LBG 787, PU 31 

• పంట కాలపరిమితి & దిగుబడి: 65 – 85 రోజులు | ఎకరానికి 5 – 7 క్వింటాళ్లు 

• మద్దతు ధర (MSP 2026-27): పెసరకు ₹8,780, మినుముకు ₹8,200 (క్వింటాలుకు) 

• కీలకమైన నీటి అవసర దశలు: పూత ప్రారంభ దశ మరియు కాయలు ఊరే దశ.

పొద్దుతిరుగుడు (Sunflower)

• మేలైన విత్తన రకాలు: KBSH 44, 53, 78, NDSH 1012, DRSH 1

• పంట కాలపరిమితి & దిగుబడి: 90 – 100 రోజులు | ఎకరానికి 8 – 10 క్వింటాళ్లు 

• మద్దతు ధర (MSP 2026-27): క్వింటాలుకు ₹8,343 

• కీలకమైన నీటి అవసర దశలు: మొగ్గ దశ, పూత వికసించే దశ మరియు గింజ గట్టిపడే దశ.

వేరుశనగ (Groundnut) — ఎకరానికి అత్యధిక ఆదాయం ఇచ్చే అవకాశం

• మేలైన విత్తన రకాలు: K6 (కదిరి-6), Kadiri-9, వశిష్ట(TCGS 1694) G201, నారాయణి 

• పంట కాలపరిమితి & దిగుబడి: 105 – 115 రోజులు | ఎకరానికి 10 – 12 క్వింటాళ్లు 

• మద్దతు ధర (MSP 2026-27): క్వింటాలుకు ₹7,517 

• కీలకమైన నీటి అవసర దశలు: పూత దశ (25వ రోజు), ఊడలు దిగే దశ (45వ రోజు) మరియు కాయ ఊరే దశ.

 శనగ (Gram / Chickpea)

• మేలైన విత్తన రకాలు: JAKI 9218, JG 11, NBeG 3, KAK 2 

• పంట కాలపరిమితి & దిగుబడి: 95 – 110 రోజులు | ఎకరానికి 8 – 10 క్వింటాళ్లు 

• మద్దతు ధర (MSP 2026-27): క్వింటాలుకు ₹5,875 

• కీలకమైన నీటి అవసర దశలు: పూత దశ మరియు కాయ తొడుగు/గింజ కట్టే దశ.

తృణధాన్యాలు (జొన్న & మొక్కజొన్న)

• రబీ జొన్న (Sorghum): CSV 216R, M 35-1 (మల్దండి) | 110 – 120 రోజులు | మద్దతు ధర ₹4,023 (ఎకరానికి 12–15 క్వింటాళ్ల దిగుబడి) 

• మొక్కజొన్న (Maize): DHM -117, DHM-121, DHM -206  | 115 – 125 రోజులు | మద్దతు ధర ₹2,410 (ఎకరానికి 25–30 క్వింటాళ్ల భారీ దిగుబడి) 

ఖర్చు మరియు నీటిని ఆదా చేసే ఆధునిక సాగు పద్ధతులు

ఎల్ నినో వల్ల ఏర్పడే నీటి కొరతను అధిగమించేందుకు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ఈ క్రింది ఆధునిక పద్ధతులను ద్వారా నీరు వృధా చేయకుండా తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలను పొందవచ్చు వాటి వివరాలు : మొక్కజొన్న, జొన్న పంటల్లో ‘జోడు సాలు పద్ధతి’ (Paired Row System)ఈ విధానంలో రెండు వరుసల మధ్య దూరాన్ని తగ్గించి (సుమారు 45 సెం.మీ.), ప్రతి రెండు వరుసల జంట తర్వాత ఎక్కువ ఖాళీ స్థలాన్ని (సుమారు 75 నుండి 90 సెం.మీ.) వదులుతారు.

* 30-35% నీటి ఆదా: వెడల్పాటి స్థలం ఉన్న వరుసల మధ్య మాత్రమే నీటి కాల్వలు చేయడం వల్ల నీరు వృధా కాకుండా ఆదా అవుతుంది.అదనపు ఆదాయం: మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పెసర, మినుము లేదా నువ్వులను అంతర పంటలుగా వేసి అదనపు లాభాలు పొందవచ్చు.వరి పొలాలలో ‘జీరో టిల్లేజ్’ (భూమిని దున్నకుండా చేసే వ్యవసాయం)యాసంగిలో వరి వేయని వరి పొలాలలో (Rice Fallows) వరి కోతలు పూర్…

మరిన్ని వార్తలు