దుర్గామాత లడ్డు వేలం పాట
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో దుర్గామాత లడ్డుకు నిర్వహించిన వేలం పాటలో భక్తులు రూ.90 వేల 501 పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డుకు వేలం పాట నిర్వహించారు.
ఈ వేలం పాటలో స్కామర్స్ టీం సభ్యులైన సంజీవ్ మిత్రబృందం సభ్యులు ఈ లడ్డును దక్కించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాత లడ్డును దక్కించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు,భక్తులకు, దాతలకు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.