వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

22-10-2026 | 04:44pm

మృతుడి కుటుంబానికి ధైర్యం చెప్పిన పెండ్రు రమక్క, అజీమ్ ఖాన్, ముసుకుల సురేందర్ రెడ్డి

మంథని, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజు తండ్రి స్వర్గస్తులైన నేపథ్యంలో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు వైనాల రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంథని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పెండ్రు రమక్క, మంథని మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజీమ్ ఖాన్, పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మంతిని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి వైనాల రాజు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి మరణానికి గల కారణాలను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

దుఃఖ సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ, మృతుడికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమం ద్వారా వైనాల రాజు కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు తమ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని వార్తలు