భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్,(విజయక్రాంతి): భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా(land and voter list revisions) సవరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా(Mancherial district) నస్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ సంతోష్ కుమార్తో కలిసి ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. సాదా బైనామా, భూ భారతి దరఖాస్తుల పరిశీలన, రీ-సర్వే ప్రక్రియ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.