పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
హాజీపూర్, (విజయక్రాంతి) : మంచిర్మాల జిల్లా హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Hajipur Primary Health Centre) గురు వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అకస్మికంగా సందర్శించారు. వైద్య సిబ్బంది, సూపర్ వైజర్లతో ఆరోగ్య కార్యక్రమాలపైన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపైన సమీక్షించారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం గురించి ఆరాతీశారు.
ప్రజలు ఎలాంటి స్పర్శ లేని మచ్చలు ఉన్న ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని, బౌల్ ఔషధ చికిత్స ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, రోగులు పూర్తిగా సామాజిక జీవితం గడపవచ్చుని సూచించారు.
జిల్లా మాస్ మీడియా, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, క్షయ వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులు అందజేయడం, అసంక్రమణ వ్యాధులు బిపి, షుగర్ ను గుర్తించి రోగుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు, డీఎంహెచ్ఓ వెంట జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ రఘుపతి, పద్మ, ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు, తదితరులున్నారు.