బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని నిరసన

29-09-2026 | 02:58pm

మంచిర్యాల టౌన్,  సెప్టెంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై (BC reservations)రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని 40 సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాయి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షగా భావిస్తున్నామన్నారు.

ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీల ఉద్యమకాంక్షను గుర్తించకపోవడం బాధాకరమనీ, బీసీలు రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు చేస్తుంటే కేంద్రం సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ అని బూచిగా  చూపిస్తూ రాజ్యాంగ సవరణ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బీసీల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, నాయకులు సీనియర్, న్యాయవాది అరె లచ్చన్న , గజ్జెల్లి వెంకటయ్య, శాఖపురం బీమాసేన్, పెద్దపెల్లి సూరయ్య, పెద్దల చంద్రకాంత్, అంకం సతీష్ కీర్తి, బిక్షపతి, పోశం, వేముల కిరణ్, పిట్టల దశరథం, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు