రెండవ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
సుల్తానాబాద్, నవంబర్ 02 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) ఆదేశాల మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వార్డు 2 లో కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు మరియు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల ను వివరించారు. ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ గదాసు మంజుల రవి, 15 వార్డు కౌన్సిలర్ అమిరిషెట్టి శ్రావణి రాకేష్, యువ నాయకులు గాజుల హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.