మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును పరామర్శించిన రామగుండం మేయర్

25-10-2026 | 04:37pm

వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహంకాళి స్వామి

కమాన్‌పూర్, అక్టోబర్ 25(విజయక్రాంతి): కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజును, ఆయన సోదరుడు హనుమకొండ ప్రభుత్వ న్యాయవాది వైనాల వినోద్‌ను(Vinod Vainala) రామగుండం మేయర్ మహంకాళి స్వామి పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య మృతి చెందడంతో ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జీడీనగర్ మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య, బసంత్‌నగర్ యూనియన్ కార్మిక సంఘం అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ నాయకుడు శ్రీనివాస్, రామగుండం కార్పొరేటర్లు మారెల్లి రాజిరెడ్డి, దశరథం, బండ రమేష్‌రెడ్డి, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎల్లంకి వంశీ, గుండా రాజు, జంబోజు సమ్మయ్య, ఎరుకల లింగయ్య, మంథని సీసీఎల్ అధ్యక్షుడు మంథని సత్యం, సుందిళ్ల జనగామ కృష్ణ, పెద్దపల్లి జిల్లా డీఆర్‌డీఏ సీసీలు పాల్గొన్నారు.

అలాగే గుండారం గ్రామ మాజీ సర్పంచులు ఆకుల ఓదేలు, పిడుగు నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యుడు దేవన్న, సీనియర్ నాయకులు హర్ష ఎల్లయ్య, ముద్దాం కొమురయ్య, మంథని నాయకులు పూదరి సర్వేష్, బూడిద లింగన్న, ఆకుల సత్యం, హనుమకొండ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు, రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేష్, సుంకరి మహేష్, ముత్యాల సర్పంచ్, చందనాపూర్ సర్పంచ్ కొండా శ్రీనివాస్, ములకలపల్లి గ్రామానికి చెందిన బొల్లెపల్లి లక్ష్మణ్, బొల్లెపల్లి కుమార్, గొల్లపల్లి సాయి, గుండారం గ్రామానికి చెందిన రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని వైనాల కుటుంబానికి సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు