నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు అవకాశం ఇవ్వండి

25-10-2026 | 05:49pm

నిర్మల్ అక్టోబర్ 25 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో(Nirmal District) ప్రభుత్వం నియమించి నామినేటెడ్ పదవిలో(Nominated position) ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు(SC, ST, BC, Minority) అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ ముజాహిద్(Sheikh Mujahid) డిమాండ్ చేశారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గాని గ్రంథాలయ చైర్మన్(Library Chairman) గాని ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం వర్గానికి ఇవ్వ లేదని ఆరోపించారు. 

ఇప్పటివరకు నామినేట్ పోస్టులు(Nominated posts) గానీ ఓసి వర్గానికి ఇచ్చారు తప్ప ఏ వర్గానికి ఇవ్వలేదని విమర్శించారు. రాజకీయంలో తమకు వింటున్న తమ మార్గాల మీద నడుస్తున్న వారికి నామినేట్ పోస్టులు పదవులు ఇవ్వడం జరిగింది. బీసీ ముస్లిం యొక్క ఓట్లు 45 వేల కన్నా ఎక్కువ ఉన్న  ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి సమానమైన వాటి ఇవ్వాలని ఈ వర్గాల వారికి ఎటువంటి రాజకీయ లబ్ది గాని పెద్ద పెద్ద పదవులు గాని ఇప్పటివరకు ఇవ్వలేదు కనీసం మా ఓట్లు తీసుకుంటున్నా రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడుకైనా మాకు సామాజిక న్యాయం చేయాలని మా వాటా మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మా వాటా మాకు సామాజిక న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమిటో మా ఐక్యతను చూపిస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సభ్యులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు