విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలి

12-11-2026 | 07:50pm

కలెక్టర్ అనురాగ్ జయంతి

సంస్థాన్ నారాయణపూర్,నవంబర్ 12(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు, క్రీడా రంగాల్లోనూ ప్రతిభ కనబరిచితే  ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(District Collector Anurag Jayanti) అన్నారు. గురువారం సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్‌లోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించి పాఠశాలలోని విద్యా బోధన, మౌలిక సదుపాయాలు,

విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న బోధనపై విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డిజిటల్ విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

పదో తరగతి విద్యార్థులతో   కలెక్టర్ మాట్లడుతూ త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు.

జీవితంలో స్థిరపడటానికి చదువు ఒక్కటే మార్గం కాదని, క్రీడలు లలో కూడా ప్రతిభ కనబరిచితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి,సర్పంచ్ చిలకరాజు చందన రాజు,ప్రిన్సిపాల్  సతీష్ కుమార్, జిల్లా విద్యాధికారి బిక్షపతి,తహసీల్దార్ శ్రీనివాస్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు