మలయప్ప ఫౌండేషన్ నిర్మించిన టాయిలెట్లు ప్రారంభం

12-11-2026 | 07:52pm

ముకరంపుర, నవంబర్ (విజయ క్రాంతి): మలయప్ప ఫౌండేషన్(Malayappa Foundation) సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన టాయిలెట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మలయప్ప ఫౌండేషన్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో కరీంనగర్ లోని కొత్తపల్లి, మల్కాపూర్, శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన టాయిలెట్లను గురువారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెల్లించారని, త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను కూడా పంపిణీ చేయబోతున్నారని తెలిపారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుతూ  వాడుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవిత చంద్రశేఖర్, కాంతాల జగన్ రెడ్డి, పిట్టల జ్యోతి విష్ణు, బండ రమణారెడ్డి, బిజెపి మండల నాయకులు హరీష్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, సత్తిరెడ్డి, డీఈఓ వై.తిరుపతి రావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు