గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం

12-11-2026 | 07:43pm

ఖమ్మం, నవంబర్ 12  హెల్త్ విజయక్రాంతి: గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం(Rural doctors provide primary medical care) మాత్రమే అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం పట్టణంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మహిళా గ్రామీణ వైద్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ వైద్యులకు గుర్తింపు కల్పించి, ప్రాథమిక వైద్యం అందించేందుకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులపై తనిఖీలు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

ఆర్ఎంపీలకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. మహిళా గ్రామీణ వైద్యులకు ప్రాథమిక వైద్యంపై వివిధ విభాగాల్లో శిక్షణ అందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నెమలికొండ మణికుమార్, కనకం బాబు, మహిళా జిల్లా నాయకురాళ్లు కొండ్ర మధుప్రియ, ఎం. శ్రీదేవి, ఎన్. పార్వతి, ఏ. జయమణి, డి. సంధ్యారాణి, యు. లక్ష్మి, ఈ. రామేశ్వరి, శ్రీలక్ష్మి, ఎన్. నాగమణి, కే. సుజాత, ఏ. అంజలి, సిహెచ్. అనిత, భాగ్యలక్ష్మి, ఏ. ఉష, బి. సుశీల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు