క్లాసిక్ లుక్‌లో హీరో డెస్టిని 110
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మోటర్‌సైకిల్స్, స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్, తమ ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ స్కూటర్‌కు సరికొత్త, విలక్షణమైన శైలిని తీసుకువస్తూ డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్‌ను నేడు ఆవిష్కరించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ లో ఆకట్టుకునే రీతిలో డ్యూయల్-టోన్ రంగుల కలయికలు, విలక్షణమైన చారల డిజైన్స్, ప్రత్యేకమైన 3D క్లాసిక్ ఎడిషన్ చిహ్నం వంటివి ఉండటం చేత డెస్టిని 110 మరింత ఆకర్షణీయంగా మారింది. రోజువారీ ఆచరణాత్మకతను పండుగ శోభతో మేళవించి తీర్చిదిద్దిన ఈ కొత్త ఎడిషన్ డెస్టిని 110 శ్రేణికి ఒక స్టైలిష్ రూపాన్ని జోడిస్తుంది.
డెస్టిని 110, సౌకర్యం, వినియోగ సౌలభ్యం, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి భారతీయ కుటుంబాల రోజువారీ ప్రయాణ అవసరాలను తీరుస్తుంది. ఇప్పటికే తనదైన ప్రత్యేకతను చాటుతున్న వాహనానికి కొనసాగింపుగా క్లాసిక్ ఎడిషన్ తీసుకువచ్చారు. ఇందులో ప్రత్యేకమైన నియో-రెట్రో డిజైన్‌ను జోడించడం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న శ్రేణికి కొత్త రూపాన్ని అందించారు.
ఈ విడుదల సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ “ఫ్యామిలీ స్కూటర్ కస్టమర్ల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డెస్టిని 110 అభివృద్ధి చేయబడింది. సౌకర్యం, వినియోగ సౌలభ్యం, ఇంధన సామర్థ్యం వంటి అంశాలకు దీనిలో అధిక ప్రాధాన్యత ఇచ్చాము.
కస్టమర్ల ప్రాధాన్యతలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో, కొత్త డ్యూయల్-టోన్ రంగులు, విలక్షణమైన డిటైలింగ్ ద్వారా డెస్టిని 110 పోర్ట్‌ఫోలియోకు ఒక సరికొత్త డిజైన్ రూపాన్ని క్లాసిక్ ఎడిషన్ అందిస్తుంది. అదే సమయంలో ఈ మోడల్ ప్రత్యేకతల్లో కీలకమైన ఆచరణాత్మక సౌకర్యాలను కొనసాగిస్తోంది. ఈ కొత్త ఎడిషన్ ద్వారా మోడల్‌కు ఇప్పటికే ఉన్న బలాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి, అదే సమయంలో డెస్టిని బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది..”అని అన్నారు.
డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్‌లో రెండు కొత్త డ్యూయల్-టోన్ రంగుల కలయికలు ఉన్నాయి: బ్రౌన్ ఇన్నర్ ప్యానెల్స్‌తో మ్యాట్ గోల్డ్‌ఫిష్ సిల్వర్/లైట్ ఇండస్ట్రియల్ గ్రే , బ్లాక్ ఇన్నర్ ప్యానెల్స్‌తో మ్యాట్ ఏరీస్ బ్రౌన్ వీటిలో ఉన్నాయి.
ఫ్రంట్ హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై కొత్త స్ట్రిప్స్, రంగుల అద్దాలు, రంగుకు సరిపోయే సీటు, లోపలి ప్యానెల్స్, ప్రత్యేకమైన 3D క్లాసిక్ ఎడిషన్ బ్యాడ్జ్ , బ్రాండెడ్ రిమ్ టేప్ వంటివి ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 76,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది అన్ని హీరో డీలర్‌షిప్‌లలో లభిస్తుంది.