ఆస్పత్రిని సందర్శించిన డిగ్రీ కళాశాల విద్యార్థులు
31-10-2026 | 08:28pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Nirmal Government Degree College)లో చదువుతున్నటువంటి లైఫ్ సైన్స్ విద్యార్థులు(Life Science Students) అకాడమీ నిర్మల్ ప్రభుత్వ జనరల్ సందర్శించారు. హాస్పిటల్ లో డయాలసిస్ యూనిట్, ఐసీయూ టీ హబ్, రేడియాలజీ హబ్ సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ సుమలత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్, ఏవో నాగ శ్రీనివాస్, జంతు శాస్త్ర విభాగ అధ్యాపకులు అరుగుల నరేందర్, నుష్రత్ జహాన్, డాక్టర్ రంజిత్ కుమార్, సాదియా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు