నిర్మల్ ఎమ్మెల్యే పరామర్శ

31-10-2026 | 08:37pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గొల్లపేట్ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్యామకూర ఆనంద్ మాతృమూర్తి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొల్లపేట్‌లోని ఆనంద్ నివాసానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆనంద్‌కు ధైర్యం చెబుతూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినిషా లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు అయిండ్ల భూపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు  సత్యం చంద్రకాంత్, మరియు జుట్టు దినేష్, ఇర్ల విజయ్, కొరిపెల్లి శ్రవణ్ రెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు