జనగామను కరువు మండలంగా ప్రకటించాలి

29-10-2026 | 05:37pm

జనగామ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జనగామ మండలం లేకపోవడంతో ఇక్కడి రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మాదిగ మేధావుల ఫోరం జనగామ జిల్లా కోఆర్డినేటర్ యాసారపు కరుణాకర్(Coordinator Yasarapu Karunakar) అన్నారు. గురువారం జనగామలో ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక జనగామ మండలంలో ఒక్క చెరువు కూడా నిండలేదని, అన్ని గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జనగామను కరువు మండలంగా ప్రకటించకపోతే దశలవారీగా రైతులు, ప్రజలు, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం రైతు సంఘం నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే వారంలో అన్ని గ్రామాల్లోని చెరువులను సందర్శిస్తామని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించకపోవడం వల్ల ప్రజలు సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడటమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రోత్సాహకాలను కోల్పోతారని అన్నారు.

మరిన్ని వార్తలు