మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

02-10-2026 | 07:52pm

సుల్తానాబాద్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు(Government Whip Chintakunta Vijayaramana Rao) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత ,  వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్,  మున్సిపల్ కమిషనర్ రమేష్ , నాయకులు దనాయక్ దామోదర్ రావు, కొమురవెల్లి రామ్మూర్తి, పల్ల మురళీధర్, అల్లంకి  సత్యనారాయణ, పల్లా సురేష్ , అల్లంకి శ్రీనివాస్ తో పాటు  పలువురు ప్రజా ప్రతినిధులు,  కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఎదురుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు