మృతుడి కుటుంబానికి గ్రామస్తుల ఆర్థిక సహాయం.. రూ.9,350 అందజేత
గండీడ్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): మండల పరిధిలోని పగిడ్యాల్ గ్రామస్తులు(Pagidyal Villagers) మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన చెలిమిళ్ల సెట్ కృష్ణయ్య, కుమారుడు వంశీకృష్ణ(25) మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. గ్రామ అభివృద్ధి వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేయడంతో గ్రామస్తులు స్పందించి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించారు.
ఈ విధంగా మొత్తం రూ.9,350 జమ కాగా, ఆ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రె కిష్టయ్య, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, కర్రె హనుమంతు, బోరు కృష్ణయ్య, కర్రె పెద్ద బచ్చయ్య, మీదింటి రామయ్య,ఎస్ తిరుమలయ్య, కర్రె మల్లేష్,ఎం.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.