కాంగ్రెస్ నిరంకుశ విధానాలపై మండిపడ్డ మాజీ మంత్రి

02-10-2026 | 09:55pm

ముకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనను సిరిసిల్ల ప్రాంత ప్రజలు మరియు బి ఆర్ స్ కార్యకర్తలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కేవలం కెసిఆర్, కేటీఆర్, మరియు హరీష్ రావుల పై కక్షసాధింపు చర్యలు, చేయడానికీ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 35 నెలలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చలేదని, రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో, ప్రాజెక్టుల రీ-డిజైన్ల పేరుతో ఎంత దోచుకుందో, ఢిల్లీకి ఎన్ని వేల కోట్లు పంపిందో దానిపై ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.​ తెలంగాణ ఉద్యమమే లేకుంటే రేవంత్ రెడ్డి అడ్రస్ ఎక్కడ ఉండేదని, ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలు మానుకొని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ జిల్లా నాయకులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు