మహిళా సమాఖ్య సభ్యులకు విజన్ బిల్డింగ్ పై శిక్షణ కార్యక్రమం

02-10-2026 | 09:34pm

నాగిరెడ్డిపేట,అక్టోబర్ 2 (విజయ క్రాంతి):మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో(Federal Office) మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులు, వివోఏలు, సీసీలకు ఎన్.ఆర్.ఎల్.ఎం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి  యాన్.ఆర్.ఎల్.ఎం స్టేట్ రిసోర్స్ పర్సన్స్  కవిత, రమాదేవి శిక్షకులుగా పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా విజన్ బిల్డింగ్1, మాడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ నిర్మాణం, బాధ్యతలు,కార్యాచరణతో పాటు వి.ఎం.ఓ ఎస్.ఏ అంశాలపై శిక్షణ అందించారు.అలాగే మండల సమాఖ్య కార్యవర్గ సభ్యుల బాధ్యతలు,సమావేశాల నిర్వహణ,సమాఖ్య కార్యకలాపాల ప్రణాళిక, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడం,గ్రామస్థాయి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలను వివరించారు.

శిక్షణలో సమాఖ్య లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం,వాటిని కార్యాచరణ ప్రణాళికగా రూపొందించడం,నిర్దేశిత లక్ష్యాలను కొలిచే విధంగా  ఎస్.ఎం.ఏ.ఆర్.టి విధానంలో ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించారు.అదేవిధంగా సూచికలు లక్ష్యాల నిర్ణయం,కార్యాచరణ ప్రణాళిక మరియు సమయపాలన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

మండల సమాఖ్యను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్యవర్గ సభ్యులు,వివోఏలు,సీసీల పాత్ర మరియు బాధ్యతలను వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపియం దత్తు,మండల సమాఖ్య అధ్యక్ష శాంత,కార్యదర్శి మంజుల,సీసీలు నజీర్,రాజు,రవి,రాజయ్య, రాజు,సావిత్రి,అకౌంటెంట్ రాజు,ఆపరేటర్ రవి,విఓఏలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు