మేడిపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

02-10-2026 | 09:52pm

ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ శైలజ

తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో మొక్కలు, పండ్ల పంపిణీ

మేడిపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ(Deputy Commissioner Shailaja) ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి  నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు పండ్ల మొక్కలు, పూల మొక్కలు పంపిణీ, అమ్మఒడి అనాధాశ్రమంలో అనాధ పిల్లలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఆశయాల కోసం ప్రతి భారతీయుడు కృషి చేస్తూ దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీలు జలంధర్ రెడ్డి, బుచ్చి యాదవ్, బండారి రవీందర్, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీరాములు గౌడ్, బీసీ సెల్, ఎస్సీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, కాంగ్రెస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు