తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే?

22-10-2026 | 06:50pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Actor Teja Sajja) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ నటుడు.. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహ వేడుక(Wedding Ceremony) నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

పెద్దలు కుదిర్చిన వివాహం..

ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. తేజ సజ్జా కాబోయే జీవిత భాగస్వామికి సినీ పరిశ్రమతో సంబంధాలు లేవని, ఆమె అమెరికాలో పెరిగారని కథనాలు వెల్లడించాయి. ఆమె కుటుంబం టెక్నాలజీ రంగంలో వ్యాపారం నిర్వహిస్తుండగా, ఆమె తన తండ్రితో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.

ఉదయ్‌పూర్‌లో నిరాడంబరంగా వేడుక!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌(Udaipur)లో డిసెంబర్‌లో వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచేందుకు ఇష్టపడే తేజ.. తన పెళ్లిని కూడా పరిమిత ఆహ్వానితుల మధ్య నిర్వహించాలని భావిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే, వివాహ తేదీ, కాబోయే భార్య పేరు వంటి వివరాలను వెల్లడించలేదు. తేజ సజ్జా పెళ్లి వార్తతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు