చండీయాగ హోమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. అనంతరం అన్నదానం
బోధన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చండీయాగ హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య(Police Commissioner P. Sai Chaitanya), ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, అదనపు కలెక్టర్లు భుజంగరావు, పి. సురేష్, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, నిజామాబాద్ ఏసీపీలు, ఏఆర్ ఏసీపీలు, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.