మహిషాసురమర్థిని దేవి అవతారంలో ఫ్రెండ్స్ యూత్ అమ్మవారు
19-10-2026 | 08:42pm
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్థిని దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా పురోహితులు కొదురుపాక కృష్ణమాచార్యులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, చిన్నారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.