మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విద్యాధరి
- ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దంపతులు
- వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం
గజ్వేల్: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్ర మహోత్సవాల్లో(Sharannavaratri Utsavams) భాగంగా సోమవారం శ్రీ విద్యాధరి అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించగా, ఆలయ బాధ్యులు రాజశేఖర శర్మ ప్రధాన కలశాన్ని అమ్మవారికి సమర్పించారు.
వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, మహా పూర్ణాహుతి, 108 కలశాల ప్రతిష్ట తదితర నిర్వహించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేయగా, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి(Former MLA Narsareddy) దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారికి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయగా, డిసిసి అధ్యక్షురాలు తూoకుంట అంక్షారెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రభుదాస్ గౌడ్, మాజీ ఎంపీపీ మోహన్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.