ఖేలో ఇండియా వాలీబాల్ ఎంపిక పోటీలు

19-10-2026 | 08:50pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామంలో ఖేలో ఇండియా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అండర్ 17 బాలురు, బాలికలకు వాలీబాల్ ఎంపీక పోటీలు సోమవారం జరిగాయి. బెల్లంపల్లి పోలీసు డిపార్టుమెంటు సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. ఇండియన్ వాలీబాల్ క్రీడాకారులు ఏసిసి రవి, తాళ్ల గుర్జాల ఎస్ఐ ప్రశాంత్, గురజాల సర్పంచ్ వంగ రాములు, చంద్రవెల్లి సర్పంచ్ శ్రీనివాస్, గురజాల ఉప సర్పంచ్ డాకూరి సురేష్, గురజాల వార్డు సభ్యులు వెంకటేష్, కోటయ్య, సీనియర్ క్రీడాకారులు ముస్తఫా రమేష్, రషీద్, నరేష్, సందీప్, కేశవ్, రాహుల్, సాయికుమార్, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు