వ్యర్థాల నిర్వహణ, అవగాహన

19-09-2026 | 05:06pm

నిర్మల్,(విజయక్రాంతి): స్వచ్ఛతా హి సేవా ప్రచారం(Swachhata Hi Seva campaign)లో భాగంగా విబిజి రామ్ జి, సెర్ప్ సిబ్బందితో జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్(District Rural Swachh Bharat Mission), గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి(District Rural Development Agency Officer Vijayalakshmi) మాట్లాడుతూ... చెత్తను వివిధ పద్ధతుల్లో వేరు చేయడం, తగ్గించడం, పునర్వినియోగం, పునరుత్పత్తి పద్ధతులను ప్రోత్సహించడం పై కూలంకషంగా వివరించారు.

వ్యర్థాల నుండి సంపద సృష్టించే విధానాలు, పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త నిర్వహణ పద్ధతులపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా వికసించాలంటే సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని, పర్యావరణహిత స్థిరమైన జీవన పద్ధతులను పెంపొందించుకోవాలని వివరించారు. అనంతరం అందరూ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు