136 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

19-09-2026 | 05:50pm
  1. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి చొరవతో మంజూరు.. 
  2. లబ్ధిదారులకు అందజేసిన మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్‌ రెడ్డి

నేలకొండపల్లి, విజయ క్రాంతి: పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)(State Government Chief Minister's Relief Fund) ద్వారా సహాయం అందిస్తోందని తుంబూరు దయాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister of Information Ponguleti Srinivasa Reddy) సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శనివారం నేలకొండపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు మంత్రి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పేదల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని దయాకర్‌రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలంలో త్వరలోనే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పంటలు సాగు చేపట్టిన రైతులకు ఇబ్బందులు కలగకుండా పాలేరు రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే మంత్రి పొంగులేటి లక్ష్యమని వివరించారు.

ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కొడాలి గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొందయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి వెంకన్న, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు