కోనరావుపేట వ్యవసాయ సహకార సంఘం నూతన కమిటీ ఏర్పాటు

19-09-2026 | 05:49pm

- చైర్మన్‌గా చేపూరి గంగాధర్ నియామకం

కోనరావుపేట(విజయక్రాంతి): కోనరావుపేట వ్యవసాయ సహకార సంఘానికి(Konaraopet Agricultural Cooperative Society) నూతన కమిటీని నియమించారు. చైర్మన్‌గా చేపూరి గంగాధర్ నియమితులయ్యారు. సభ్యులుగా మనువాడ భూమయ్య, కులేరు సత్తవ్వ, నునవత్ శంకర్, ముదాం సత్తయ్య, కర్రే శంకరయ్య, మోతే రాంరెడ్డి, నాలుక సత్యం, రావులపల్లి మహిపాల్‌రెడ్డి, గుమ్మడి అమృతరావు, తాళ్లపల్లి రాజయ్య, భూక్యా ప్రకాష్, నేవూరి పుష్పలత నియమితులయ్యారు. మొత్తం 13 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది. నూతన కమిటీ వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు