నింపిన పోలీసుల ఓపెన్ హౌస్..
నిర్మల్ అక్టోబర్ 28 ( విజయక్రాంతి); పోలీసు శాఖలో చేరేలా ప్రోత్సహించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం(Police 'Open House' event) నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసుల విధులు, బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర, వినియోగించే ఆయుధాలు, పరికరాల గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.