పట్టభద్రులారా! ఓటరుగా నమోదు చేసుకోండి

28-10-2026 | 06:34pm

కొమురవెల్లి, ( విజయ క్రాంతి): ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలలో ఉన్న పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ఎరుపుల మహేష్ పిలుపునిచ్చారు.  అర్హులైన పట్టభద్రులు ఫారం-   18 ద్వారా తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని తెలిపారు. తమ హక్కును నిర్లక్ష్యం చేయకుండా ఓటరుగా  నమోదు చేసుకొని, తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, బోధినేతర సిబ్బంది, డాక్టర్లు, లాయర్లు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన వారు నమోదు చేసుకోవాలని కోరారు. త్వరగా నమోదు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో నాయకులు బూరుగు భారత్, మకిలి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు